అంతర్జాతీయం (International) వార్తలు (News)

చైనా వరదలలో మృతుల సంఖ్య 300లకు పైమాటే!!

చైనాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గత వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని విధంగా వచ్చిన వరదలతో మృతుల సంఖ్య 300లకు పైగా చేరిందని హెనాన్‌ ప్రొవిన్షియల్‌ అధికారులు తాజాగా ప్రకటించారు.

సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో ఈ వరదల విలయానికి మొత్తంగా 302 మంది మరణించగా, 50 మంది గల్లంతైనట్టు, మృతుల్లో అత్యధికంగా ఝెంగ్‌ఝౌ ప్రొవిన్సియల్‌ కేపిటల్‌కు చెందినవారేనని,ఒక్క నగరంలోనే అత్యధికంగా 292 మంది ప్రాణాలు కోల్పోగా, 47మంది గల్లంతైనట్టు ఆయన వెల్లడించారు.

ఈ వరదలతో 30 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురికాగా, దాదాపు 3.76 లక్షల మందిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఇటీవల చైనా అధికారులు ప్రకటించగా ఈ వరదల కారణంగా దాదాపు 10 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్టు చైనా ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •