అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

వూహాన్‌ నగరంకు చేరిన డెల్టా వేరియంట్??

కరోనా కు పుట్టిల్లైన వూహాన్‌ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ నిన్న ఒక్క రోజే 61 కేసులు నమోదయ్యాయి. అది డెల్టా వేరియంట్ కావడంతో చైనా ప్రభుత్వం కూడా అప్రమత్తమై కరోనా టెస్టుల సంఖ్య పెంచింది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వీలైనంత వరకు ఉపయోగించొద్దని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వైరస్ సోకిన వారిని, వారితో తిరిగిన వారిని ఐసోలేషన్‌లో పెడుతోంది. ఇది డేంజరస్‌ వేరియంట్‌ కావడంతో ప్రాథమిక స్థాయిలోనే వైరస్ బాధితులను గుర్తించేందుకు వూహాన్‌ అధికారులు కష్టపడుతున్నారు.

వూహాన్‌తో పాటు బీజింగ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతూ చైనా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అంతే కాకుండా డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉంది. పైగా చైనాలో జనాభా ఎక్కువ కావడం, వ్యాక్సిన్‌ వేయించుకున్నామన్న ధీమా ఉండడం ప్రజలు నిబంధనలను బేఖాతరు చేయడంతో వ్యాక్సిన్ వేయించుకున్నా సరే డెల్టా వైరస్‌ ప్రతాపం చూపుతోంది. పైగా చైనా వ్యాక్సిన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉండగా చైనా తయారుచేసిన టీకాల సమర్థత ఎంత అన్నది తెలీదు. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి టీకాలు వేసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నామన్న ధీమాతో అజాగ్రత్తగా ఉండడంతో చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వైరాలజీ ల్యాబ్ ఉన్న వూహాన్‌కు సైతం చేరడం గమనించదగ్గ విషయం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    89
    Shares
  • 89
  •  
  •  
  •  
  •