అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

18 ఏళ్ల క్రితం చోరీకి గురైన వజ్రాల ఆలం.. మళ్ళీ ఇన్నాళ్లకు!!

నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా 14 కళాఖండాల సేకరణను భారతదేశానికి తిరిగి ఇవ్వబోతుండగా రెండు బంగారం, వజ్రాలుతో కూడిన ఆలం, మహారాజా కిషన్ పెర్షాద్ అసలు ఛాయాచిత్రం ఉన్నట్లు తెలుస్తుండగా హైదరాబాద్ వజ్రాల ఆలం (పీర్ ) 2003లో చోరీకి గురై అక్కడ నుండి ఆస్ట్రేలియాకు చేరింది. బంగారం,వజ్రాలతో తయారీ చేయబడిన ఆలం ఇప్పుడు నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉండగా భారత్ కు అప్పగిస్తామని ఆ ప్రభుత్వం చెబుతొంది. 1956లో చివరి నిజామ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ ఆలం ను బహుమతిగా నిజామ్ ట్రస్ట్ కు ఇచ్చాడు. ఇది తిరిగి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ఎవరు చేసారు? ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం తిరిగి ఇవ్వడానికి అంగికరించిందా? ఎప్పుడు వస్తోంది? ఇప్పుడు చర్చ కొనసాగుతోంది.

ఇదిలావుంటే ఇండియాకు పవిత్ర అలం తిరిగి వస్తుండడంతో హైద్రాబాద్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, వక్ఫ్ బోర్డ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సఫీవుల్లా ఆలం ను తిరిగి ఇవ్వాలనే ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం దాని అసలు స్థానంలో తిరిగి ఇన్‌స్టాల్ చేయడానికి హైదరాబాద్‌కు అప్పగిస్తుందని ఆయన ఆశించారు. ఇండియాకు అలం చేరుకున్న తరవాత.. ఎక్కడ నుండి దొంగిలించబడిందో.. అక్కడే తిరిగి ప్రతిష్టించాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •