వార్తలు (News)

ఒడిశాలో చిరుతపులులకు డీఎన్‌ఏ టెస్టులు !!

ఒడిశా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఒక వినూత్న నిర్ణయం తీసుకుని తమ రాష్ట్రంలోని అడవుల్లో సంచరించే చిరుతపులుల డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ను చేపట్టేందుకు ప్రణాళిక రచించింది. ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ హెల్త్ దీనికి సహకరిస్తుంది. అడవుల్లో చిరుతల మలాన్ని సేకరించి, పంజాగుర్తులను నమోదు చేసుకుని డీఎన్‌ఏ టెస్టుకోసం ప్రయోగశాలకు పంపించడం ద్వారా భవిష్యత్తులో వేటగాళ్లు, అక్రమ రవాణాదారుల వద్ద చిరుత చర్మాలు పట్టుబడినప్పుడు అవి ఎక్కడికి చెందినవో వెంటనే గుర్తించేందుకు వీలవుతుంది. తద్వారా వన్యప్రాణులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను అరికట్టడమేగాక, నేరస్థులకు తగినవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద శిక్షలు పడేలా చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •