వార్తలు (News)

మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులకు దిగజారుతున్న భారత్!!

భారత్ లో మొదటి దశ కరోనా వైరస్ కంటే రెండవ దశ కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించడంతో దేశంలోని అన్ని ప్రాంతాలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాయి.
మొన్నటి వరకు లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ సెకండ్ డేవేవ్ ప్రభావం నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయట పడుతుండడంతో క్రమంగా సడలింపు ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకినప్పటికీ ధైర్యంగా పోరాడవచ్చని ధీమా తో కొంతమంది కనీసం మాస్కు పెట్టుకోకపోవడమే కాకుండా భౌతిక దూరం కూడా పాటించకపోవడం వల్ల మళ్లీ విపత్కర పరిస్థితులు ఏర్పడే లాగే పరిస్థితులు మారిపోతున్నాయి. ఎందుకంటే మళ్లీ దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ రోజురోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ రికవరీ కేసుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో మళ్లీ చెడ్డ రోజులు వచ్చే లాగే కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. కొన్ని రాష్ట్రాలలో వారంతపు లాక్డౌన్ విధిస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇక మళ్ళీ చెడ్డ రోజులు రాబోతున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •