ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కరోనాతో రక్తం గడ్డ కట్టడంవల్లే ఎక్కువ మరణాలు!!

కరోన వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తుల మీద దాడి చేసినప్పటికీ కూడా కోవిడ్‌ను రక్తనాళాలకు సంబంధించిన వ్యాధిగానూ పరిగణించాల్సి ఉంటుందని గుర్తించారు. వైరస్ కాటుకు గురైన వారిలో 14 నుంచి 28 శాతం మందిలో రక్తం గడ్డకట్టుకుపోతున్నట్లు,
రక్తనాళాల్లో అడ్డంకులు (థ్రాంబోసిస్‌) ఏర్పడుతున్నాయని, దీంతో్ అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తుందని పేర్కొన్నారు.

కొంత మంది కరోనా రోగుల్లో వీనస్ థ్రాంబోసిస్, చాలా అరుదుగా గ్యాంగ్‌రిన్ సంభవించిందని, ఢిల్లీకి చెందిన గంగారామ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అంబరీష్ సాత్విక్ కరోనా వల్ల రక్తం ఎలా గడ్డ కడుతుందో ఆధారాలతోసహా బయటపెట్టారు. సరైన సమయానికి చికిత్స అందించకుండా ఉంటే రక్తం గడ్డల కారణంగా హార్ట ఎటాక్‌, స్ట్రోక్‌, అవయవాలు కల్పోవడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయని తెలిపారు.

అలాంటి రోగుల్లో గ్యాంగ్‌రిన్ సంభవించిన అవయవాలను తొలగిస్తున్నామని అప్పుడే రోగి బతకడానికి అవసరముందని, వైరస్ సోకిన ఐదు రోజులకే కోవిడ్ పేషెంట్లలో రక్తం గడ్డకట్టుకుపోతున్న ఉదంతాలు మొదటిగా న్యూయార్క్‌లో సంభవించాయని, ఇప్పుడు భారత్‌లోనూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయన్నారు. చాలా కేసుల్లో వైరస్ సోకిన ఐదు రోజుల్లోనే రక్తం గడ్డకట్టుకు పోతుండటాన్ని గుర్తించామని ప్రాథమిక దశలోనే దానిని గుర్తించి చికిత్స అందించకుంటే గుండెపోటు, అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    47
    Shares
  • 47
  •  
  •  
  •  
  •