అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అంగారకుడి కొత్త చిత్రాలు..!!

ఖగోళ పరిశోధనల్లో అంగారక గ్రహంపై అక్కడ జీవం ఉందా? మానవ జాతి నివసించేందుకు అవకాశం ఉందా? దితర అంశాలపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అంగారక గ్రహానికి సంబంధించిన కొన్ని చిత్రాలను నాసా విడుదల చేసింది.

తాజాగా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ చిత్రీకరించిన అంగారకుడి మూడు చిత్రాలను నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇందులో ఒక చిత్రంలో రాతి నిర్మాణాలు, మరో చిత్రంలో ఇసుక దిబ్బలు, మూడో చిత్రంలో మంచుతో గడ్డ కట్టిన ప్రదేశం కనిపిస్తున్నాయి.

మొదటి చిత్రంలో రాతి నిర్మాణాలు మెట్లు మెట్లుగా ఉండగా, రెండో చిత్రంలో కనిపిస్తున్న ఇసుక దిబ్బ క్షేత్రాలు శీతాకాల సమయంలో చిత్రీకరించినవి. ఇక మూడో చిత్రంలో మంచు పలకల్లా పరుచుకుపోయిన ఆ ప్రదేశం అంగారక దక్షిణ ధ్రువంలో చిత్రీకరించినది. .భవిష్యత్తులో అంగారకుడికి సంబంధించిన కీలక విషయాలు,చిత్రాలు వీటి ద్వారా వెలుగుచూడనున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    15
    Shares
  • 15
  •  
  •  
  •  
  •