ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

నిపుణులను కలవర పెడుతున్న ఆర్ ఫ్యాక్టర్ ??

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి, రోజు వారి వెలుగు చూస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి రేటును తెలియచేసే ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబై, పూణే నగరాలు మినహా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో ఆర్ ఫ్యాక్టర్ ఒకటి దాటడం నిపుణులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడిని వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్న వేగాన్ని ఆర్ ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (IMS) జూలై చివరి నాటికి వైరస్ వ్యాప్తి అంచనా వేస్తూ ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కంటే ఎక్కువ నమోదు అవుతున్నట్లు గుర్తించింది.

ఢిల్లీలో ప్రస్తుతం 1. 03 కి చేరగా, చెన్నైలో 1. 15, కొలకత్తా లో 1, బెంగుళూరులో 1కి చేరింది. ఇతర పట్టణాల్లోనూ ఇదే వైఖరి కనపడుతోంది.

దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ రేటు ఒకటి దాటగా మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర మినహా ఈశాన్య రాష్ట్రాల్లో ముందు నుంచి ఈ సంఖ్య ఒకటి దగ్గరగా ఉంది. ఇక బెంగళూర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోనూ క్రమక్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి రేటు 1 గా ఉంది.

ఇక పాజిటివ్ నిర్ధారణ అయిన ఒక వ్యక్తి నుండి ఎంతమందికి ఇన్ఫెక్షన్ అనే విషయాన్ని రీ ప్రొడక్షన్ రేట్ ద్వారా అంచనావేసి ఒకటి కంటే తక్కువ ఉన్నట్లయితే వైరస్ అదుపులో ఉన్నట్టుగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరుణ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ ఫ్యాక్టర్ నిపుణులను కలవరపెడుతోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •