జాతీయం (National) వార్తలు (News)

భారీ లాభాల్లో ముగిసిన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 16 వేల మార్క్‌ను దాటింది. ఓ దశలో సెన్సెక్స్‌ 937 పాయింట్లు లాభపడి 53,887 వద్ద చివరకు 872 పాయింట్లు లాభపడి 53,823 వద్ద ముగియగా, నిఫ్టీ 261 పాయింట్లు ఎగబాకి 16,146 వద్ద జీవిత కాల గరిష్ఠాలను తాకి చివరికి 245 పాయింట్లు ఎగబాకి 16,130 వద్ద ముగిశాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, టైటన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగియగా, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •