జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో మొదలైన నేటి మార్కెట్లు!!

సోమవారం నాడు లాభాలతో ముగిసిన నేటి మార్కెట్లు మంగళవారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండడం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం దేశీయ సూచీలకు దన్నుగా నిలుస్తోంది. నేటి ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 238 పాయింట్ల లాభంతో 53,182 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 57 పాయింట్లు లాభపడి 15,940 వద్ద ట్రేడవుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో టైటన్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •