టాప్ స్టోరీస్ (Top Stories) రాజకీయం (Politics) వార్తలు (News)

ఏపీ భవన్ సాక్షిగా మిన్నంటిన విశాఖ ఉక్కు కార్మికుల నిరసనలు!!

ఢిల్లీలో రెండో రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం నాడు ఏపీ భవన్ వద్ద కార్మికులు ధర్నాలు చేపట్టారు. కార్మికులకు ఆప్, వైఎస్ ఆర్ సిపి మరియు వామపక్షాలు మద్దతు తెలిపాయి. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదం తో నిన్న కూడా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు మిన్నంటిన సంగతి పాఠకులకు విధితమే. బారికేడ్లు, పోలీసుల ఆంక్షలు అన్నింటిని తప్పించుకొని ఆంధ్ర ప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయాన్ని జంతర్ మంతర్ సాక్షిగా ఎలుగెత్తి చాటారు. రెండో రోజు ఏపీ భవన్ వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసన శాస్త్రాన్ని సంధిస్తున్నారు. ఈ పోరాటంలో వారు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    566
    Shares
  • 566
  •  
  •  
  •  
  •