ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

అంజీర్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఏంటి?

అరేబియన్ దేశాన్ని అంజీరాకు పుట్టినిల్లుగా చెప్పొచ్చు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం నుండే అక్కడ నుండి మన దేశానికి వచ్చి ఎక్కువ ఉష్ణ ప్రాంతాలలో మరియు శీతల ప్రాంతాలలో బాగా విస్తారంగా పెరుగుతుంది. అంజీర ఎక్కువగా పక్వానికి వచ్చిన పండు కంటే ఎండు ఫలాలుగ బాగా వాడుకలో ఉంది. అయితే కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ, కొన్ని పండ్లలో తాజా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర మొదటి స్థానంలో ఉంటుంది. అంజీరను ఆంగ్లంలో ఫిగ్స్ అని అంటారు. హిందీలో అంజీర్ అని పిలుస్తారు. దీనిని సీమ మేడిపండు అని కూడా అంటారు.

ప్రత్యేకించి అంజీర పండులో వి టమిన్ ఎ, బి1, బి2, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ తో పాటు కావలసినంత పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇవి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. మారిన జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో రక్తహీనత ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. రక్తహీనత అనగానే ఐరన్ ట్యాబెట్లకు సిద్ధమయ్యే వారికి ఇవి ప్రకృతి సహజమైన అంజీర పండ్లు దివ్య ఔషధం అని చెప్పాలి. పిల్లలు లేని వారు, కనాలనుకునే వారు అంజీర పండ్లు రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. మెగ్నీషియం, మాంగనీసు, జింకు ఖనిజాలు సంతాన సాఫల్యతను పెంచడానికి సహకరిస్తాయి. గర్భధారణ సమయంలో అంజీర తింటే, పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. ఇందులోఉండే పోషకాలు పిండం ఎదుగుదలకు ఉపకరిస్తాయి. అంజీరను మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు.

అంజీరలో ఉండే పొటాషియం ఇన్సులిన్ మోతాదును క్రమబద్ధీకరిన చేసి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. అంజీరలో ఉండే పీచుపదార్ధం పెక్టిన్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.అంతేకాక హానికారక టాక్సిన్స్ ను వ్యర్ధ పదార్ధాలుగా బయటకు పంపిస్తుంది. పీచు ఎక్కువగా ఉండుట వలన మలబద్దకం సమస్య దరిచేరదు. అంజీరాలలో ఫెనాల్, ఒమేగ3 మరియు ఒమెగ6 ఫ్యాటీఆసిడ్స్ ఉండుట వలన గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •