వార్తలు (News)

తోటమాలి ఉద్యోగానికి ఎలాంటి వ్యక్తులు కావాలో మరి !!

ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ తోటమాలి ఉద్యోగానికి ధరఖాస్తులు కోరడంతో ఆ ఉద్యోగం కోసం ఓ మహిళ ధరఖాస్తు చేసుకున్నది. తోటమాలి ఉద్యోగానికి బాడీబిల్డర్ కావాలని, సున్నితమైన మగువలు ఆ పని చేయలేరని, మీరు ఈ ఉద్యోగానికి అనర్హులని కంపెనీ సమాధానం ఇస్తూ ఈ ఉద్యోగానికి ఆర్హులని మీరు భావిస్తే ఫలానా నెంబర్ కు కాల్ చేయమని కంపెనీ నుంచి సమాధానం వచ్చింది. దీనిపై సదరు మహిళ ఘాటుగా రిప్లై ఇస్తూ తనకు వ్యవసాయ పనుల్లో అనుభవం ఉందని, 40 డిగ్రీల ఎండలో వ్యవసాయ పనులు చేసినట్టు మహిళ రిప్లైలో పేర్కొంటూ మీ కంపెనీకి సంబందించిన పూర్తి వివరాలు తెలసుకున్నానని, తనకు మంచి అవకాశమని భావించానని, కాని మీ సమాధానం బట్టి తన శ్రమకు తగిన ఉద్యోగం కాదని, చులకనభావంతో మాట్లాడేవారి వద్ద పనిచేయకపోవడం ఉత్తమం అంటూ ఆ మహిళ రిప్లై ఇవ్వడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •