అంతర్జాతీయం (International) వార్తలు (News)

అబూధాబీలో కూలిన విమానం!!

శనివారం యుఎఇ రాజధాని అబూధాబీలో ఓ అంబులెన్స్ విమానం ప్రమాదవశాత్తు కూలడంతో ఇద్దరు పైలట్లు, ఓ డాక్టర్, ఓ నర్స్ మృతి చెందినట్టు సమాచారం! మృతుల్లో శిక్షణ పొందుతున్న పైలట్ ఖామిస్ సయీద్, లెఫ్టినెంట్ పైలట్ నసీర్ మహ్మద్, డాక్టర్ షహీద్ ఫరూక్ గులామ్, నర్స్ జోయెల్ మింటో ఉన్నారు. పైలట్లిద్దరూ ఎమిరేట్స్‌కు చెందినవారు కాగా, డాక్టర్ గులామ్,నర్స్ మింటోలది ఏ దేశమో ఇంకా తెలియలేదు. . మృతులకు అబూధాబీ పోలీస్‌శాఖ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •