అంతర్జాతీయం (International) వార్తలు (News)

చనిపోయిన తల్లి.. నిద్రిస్తుందని భావించిన చిన్నారులు..??

వాయువ్య ఫ్రాన్స్‌లోని లేమాన్స్‌ పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు సంతానంతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం అకస్మాత్తుగా మృతిచెందారు. అయితే ఆమె ఐదు, ఏడేళ్ల కుమార్తెలు మాత్రం తల్లి మరణించినట్లు అర్ధం చేసుకోలేక ఆమె నిద్రపోతుందని భావించారు. కానీ కొద్దిరోజులుగా సదరు బాలికలు పాఠశాలకు వెళ్లకపోవడంతో వారి తల్లికి సమాచారం అందించేందుకు ప్రయత్నించారు. స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం పోలీసులు వారి ఇంటికి వెళ్లి తలుపు తట్టగా బయటకు వచ్చిన చిన్నారులు ‘నిశ్శబ్దంగా ఉండండి. మమ్మీ నిద్రపోతోంది’ అని పోలీసులతో అన్నారు. దీంతో లోపలికి వెళ్లి చూడగా మహిళ మృతిచెంది దుర్వాసన వస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆమెది సహజ మరణంగానే తేలినట్లు వెల్లడించారు. బాలికలను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారికి కౌన్సెలింగ్‌ అందిస్తున్నారు. అయితే ఆ మహిళ మృతిచెంది ఎన్న రోజులు అవుతుందో స్పష్టంగా తెలియలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •