జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

రైళ్ల రాకపోకల్లో పలు కీలక మార్పులు!!

రైళ్ల రాకపోకలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే పలు కీలక మార్పులు చేసింది. కొత్తగా తీసుకున్న నిర్ణయాలు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా కొన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాదు పలు రైళ్లను దారి మళ్లించింది. వేగం పెంచడం, టెర్మినల్స్ లో మార్పులు చేయడం లాంటి చర్యలు తీసుకుంది. ఈ సమాచారం కోసం IRCTC వెబ్‌సైట్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, సంబంధిత రైల్వే స్టేషన్ల స్టేషన్ మేనేజర్ / ఎంక్వయిరీ కౌంటర్‌ని సంప్రదించవచ్చని సూచించింది. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 872 ట్రైన్ సర్వీసులు నడుస్తుండగా 673 ట్రైన్స్ స్పీడ్ పెంచినట్టు గా వెల్లడించింది.

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రకటించిన ప్రకారం..
సూపర్‌ పాస్ట్‌గా మారనున్న రైళ్ల వివరాలు:
సికింద్రాబాద్ – మణుగూరు ఎక్స్‌ప్రెస్ (02745/02746)
నర్సాపూర్ – నాగర్ సోల్ ఎక్స్‌ప్రెస్ (02713/02714)
కాచిగూడ – మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (02777/02778)
సికింద్రాబాద్ – రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (02755/02756)
కాకినాడ టౌన్ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (02699/02700)
సికింద్రాబాద్ – హైసర్ ఎక్స్‌ప్రెస్ (02789/02790)

ట్రైన్స్ డైవర్షన్:
02513/02514 – సికింద్రాబాద్ – గౌహతి – సికింద్రాబాద్ (వీక్లీ) – ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట- విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణిస్తుండగా.. ఇక నుంచి సికింద్రాబాద్- పడిగిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్లనుంది.
02203/02204- సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ (ట్రై వీక్లీ)- ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుండగా.. ఇక నుంచి సికింద్రాబాద్-పగిడిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది.
02784/02783 సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్(వీక్లీ).. ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట్-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుంగా..
ఇక నుంచి సికింద్రాబాద్-పగిడిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది. (కాజీపేట, వరంగల్, ఖమ్మంలలో స్టాపింగ్‌ను తీసేశారు)

08562/08561- కాచీగూడ- విశాఖపట్నం- కాచీగూడ(డైలీ).. ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట్-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుంగా.. ఇక నుంచి సికింద్రాబాద్-కాజీపేట-రాయన్‌పాడ్(బల్బు)-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది.
(విజయవాడ స్టాపింగ్‌ను తీసేశారు)

01301/01302- సీఎస్‌టీ ముంబై- కేఎస్ఆర్ బెంగళూరు- సీఎస్‌టీ ముంబై (డైలీ).. ప్రస్తుతం వాడి-గుంతకల్- గూటీ- కల్లూరు- ధర్మవరం మీదుగా రాకపోకలు సాగిస్తుండగా.. ఇక నుంచి వాడి-గుంతకల్- గంగరాయపల్లే- కల్లూరు- ధర్మవరం మీదుగా రాకపోకలు సాగించనుంది. (గూటీ స్టాపింగ్‌ను తీసేశారు)

ఎక్స్‌ప్రెస్‌గా మారనున్న ప్యాసింజర్ రైళ్లు:
57121- కాజీపేట్-సిర్పూర్ టౌన్ (07272)
57122- సిర్పూర్ టౌన్ – కాజీపేట్ (07271)
57123- భద్రాచలం రోడ్ – సిర్పూర్ టౌన్ (07260)
57124- సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్ (07259)
57381- గుంటూర్- నర్సాపూర్ (07267)
57382- నర్సాపూర్- గుంటూర్ (07268)
57547- హైదరాబాద్ డెక్కన్- పూర్ణా (07653)
57548- పూర్ణా- హైదరాబాద్ డెక్కన్ (07654)
57549- హైదరాబాద్ డెక్కన్ – ఔరంగబాద్ (07049)
57550- ఔరంగబాద్- హైదరాబాద్ డెక్కన్ (07050)
57563- నాందేడ్- తాండూర్ (07691)
57564 – తాండూర్- నాందేడ్ (07692)
67241 – విజయవాడ – కాకినాడ పోర్ట్ (07273)
67242 -కాకినాడ పోర్ట్- విజయవాడ (07264)
67243 – కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07265)
67244 – విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (07266)
67297 -గుడూరు – విజయవాడ (07261)
67298- విజయవాడ -గుడూరు (07262)
77281 – గుంటూరు – కాచిగూడ (07269)
77282 -కాచిగూడ- గుంటూరు (07270)
77693 – కాచిగూడ -రాయిచూర్ (07797)
77694- రాయిచూర్ – కాచిగూడ (07798)

టర్మినల్ మార్పులు జరగనున్నవి:
67237(తిరుపతి- గుడూరు) = 07667- (తిరుపతి-రేణిగుంట)
67239(గుడూరు-తిరుపతి) = 07666- (రేణిగుంట- తిరుపతి)
17320/17319(సికింద్రాబాద్-హుబ్లీ) = 07320/07319- (సికింద్రాబాద్-హైదరాబాద్)
17233/17234 (సికింద్రాబాద్- బల్లార్షా) = 07233/07234 – (బల్లార్షా- సిర్పూర్ కాగజ్‌నగర్)
57121(కాజిపేట్-బల్లార్షా) = 07272- (బల్లార్షా- సిర్పూర్ టౌన్)
57124 (బల్లార్షా-భద్రాచలం) = 07271- (బల్లార్షా-సిర్పూర్ టౌన్)

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •