అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ఆస్ట్రేలియా జట్టును ఉక్కిరిబిక్కిరి చేసిన భారత మహిళల జట్టు!!

ఆస్ట్రేలియా, భారత మహిళల మధ్య జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టును భారత మహిళల జట్టు కంగారు పెట్టింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసి డిక్లేర్ ఇవ్వగా అనంతరం ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 241 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ కు 136 పరుగుల ఆధిక్యం లభించడంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 3 వికెట్లకు 135 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దాంతో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా 36 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ వారు 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసిన సమయంలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించగా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ స్మృతి మందానా (127) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    9
    Shares
  • 9
  •  
  •  
  •  
  •