క్రైమ్ (Crime) వార్తలు (News)

కూంబింగ్ చేస్తుంటే పులి కళేబరాలు??

ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పులి కళేబరాలు దొరకడంతో అనుమానం వచ్చి విచారించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అడవిలో అక్రమంగా అడవి జంతువులను వేటాడుతున్న వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులి కళేబరాలు దొరికిన పరిసర ప్రాంతాల్లో, గుత్తికోయ గూడాల్లో కేంద్ర, రాష్ట్ర ఫారెస్ట్ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. వేటగాళ్ల నుంచి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి పులి గోర్లు, చర్మం, కళేబరాలు స్వాధీనం చేసుకున్నారు.

నాలుగు రోజుల క్రితం పులిని హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలిస్తే నిందితులు అప్రమత్తమై తప్పించుకునే అవకాశం ఉన్నందున పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా దర్యాప్తు, విచారణ నిర్వహిస్తున్నారు. పరీక్షల నిమిత్తం పులి చర్మం, కళేబరాలను ఎముకలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. అయితే కొద్దిరోజల క్రితం ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా భయపెట్టిన పెద్దపులిని వేటగాళ్లు ఉచ్చు వేసి చంపి ఉంటారని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •