దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11,57,156 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 9,216 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 391 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.7లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో 8,612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 99,976గా ఉంది.