నేటి నుంచి దిల్లీ పాఠశాలలు మూసివేత.. ఎందుకంటే..??

0
1

వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దిల్లీ నగరంలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. కాలుష్య పరిస్థితుల్లో పాఠశాలలు తిరిగి తెరవడంపై దిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారు’ అంటూ మందలించడంతో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని దిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ గురువారం వెల్లడించారు.

‘గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణలోకి తీసుకొని మేం పాఠశాలలు తెరిచాం. కానీ వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది’ అని మంత్రి వెల్లడించారు. ఈ కాలుష్య పరిస్థితుల కారణంగా పది రోజుల పాటు మూసిఉన్న పాఠశాలలు సోమవారం నుంచే నడుస్తుండగా ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా వాటికి బ్రేక్ పడింది.