దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 58,682 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 17,469 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ లాభాల్లో పయనిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.