డిసెంబర్‌ 3 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న వొకేషనల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 3 నుంచి 7 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టైం టేబుల్‌ రూపొందించుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇంటర్‌ కాలేజీల్లోని కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు నవంబరు, డిసెంబరు కలిపి 2 నెలల వేతనాలు విడుదల చేసారు.