ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు జవాద్‌ తుపాను ముప్పు ఉండడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండడంతో రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అది కూడా ముఖ్యంగా ఈనెల 3, 4 తేదీల్లో ఆంటే నేడు, రేపు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.