ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో తాజాగా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 ఫోర్‌మెన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో ఉన్నాయి. అలాగే ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని, ఎంపికైన వారికి నెలకు రూ. 46, 020 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పస్టం చేశారు. అయితే ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఫోర్‌మెన్‌ విభాగంలో 16 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఫోర్‌మెన్‌/సెకండ్ క్లాస్/ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ నుంచి పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

అప్లై చేసే విధానం : అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా అప్లికేషన్ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ https://www.uraniumcorp.in/ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేయాలి. అప్లికేషన్ ఫామ్ కు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సెల్ఫ్ అటెస్ట్ చేసిన మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, ఇతర విద్యార్హతల సర్టిఫికేట్లు, అనుభవం, కుల ధృవీకరణ పత్రం ను జత చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ ను Gen.Manager (Inst./Pers.&IRs./CP), Uranium Corporation of India Limited, (A Government of India Enterprise)
P.O. Jaduguda Mines, Distt.- Singhbhum East, JHARKHAND-832102 . చిరునామాకు పంపించాలని నోటిఫికేషన్లో తెలిపారు. అప్లికేషన్లకు డిసెంబర్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు.