దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్ ఇప్పటికే 29 దేశాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 373 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్‌ 16, హాంగ్‌కాంగ్‌ 7, ఇజ్రాయిల్‌ 2, బెల్జియం 2, యూకే 32, జర్మనీ 10, ఆస్ట్రేలియా 8, ఇటలీ 4, డెన్మార్క్‌ 6, ఆస్ట్రియా 4, కెనడా 7, స్వీడెన్‌ 4, స్విట్జర్లాండ్‌ 3, స్పెయిన్‌ 2, పోర్చుగల్‌ 13, జపాన్‌ 2, ఫ్రాన్స్‌ 1, ఘనా 33, దక్షిణ కొరియా 3, నైజీరియా 3, బ్రెజిల్‌ 2, నార్వే 2, ఇండియా 2, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్‌ యూఏఈలలో ఒక్కో కేసు నమోదయ్యాయి.