ఎస్బీఐ పేరుతో నగరంలో నకిలీ కాల్సెంటర్ నిర్వహిస్తున్న ముఠా మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఎస్బీఐ కేవైసీ, క్రెడిట్ కార్డుల పేరిట దిల్లీ కేంద్రంగా నడిపిస్తున్న ఒక ముఠా ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ కాల్ సెంటర్ ను ఆధారంగా చేసుకున్న ముఠా సభ్యులు దేశ వ్యాప్తంగా రూ.కోట్లు కొల్లగొట్టారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా సభ్యులు 209 కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు గుర్తించి, నిందితులకు సంబంధించిన పలు ఖాతాల్లోని నగదును పోలీసులు సీజ్ చేశారు.