కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కరోనా ప్రబలే ప్రమాదముందనే సంకేతాలు రావడంతో ప్రజలను అప్రమత్తం చేసిన వైద్యశాఖ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 5న జరిగే సండే– ఫన్‌డేను రద్దు చేస్తున్నట్లు అర్వింద్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.