వరుసగా రెండురోజులుగా లాభాల బాట పట్టిన మార్కెట్లు నేడు మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 58,555.58 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై, ఇంట్రాడేలో 57,640.57 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 764.83 పాయింట్ల నష్టంతో 57,696.46 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,424.90 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,180.80 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 183.70 పాయింట్లు నష్టపోయి 17,166.90 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్అండ్టీ, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిసాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టైటన్, బజాజ్ ఆటో షేర్లు అధికంగా నష్టపోయాయి.