న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ హత్య కేసులో 6వ నిందితుడైన వి.వసంతరావుకు బుధవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. వసంతరావు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై జస్టిస్‌ కె.లలిత విచారణ చేపట్టిన అనంతరం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు రూ.50 వేలతోపాటు అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని, వసంతరావు రామగుండం జిల్లా (పెద్దపల్లి) పరిధిలోకి ప్రవేశించరాదని షరతు విధిస్తూ ఆదేశించారు.