దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11,54,302 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 37,379 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా తో 124 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,82,017 కి చేరింది. గత 24 గంటల్లో 11,007 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3.43 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 1,71,830కి చేరాయి.

దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 1,892గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో ఓమిక్రాన్ నుండి 766 మంది కోలుకున్నారు.