ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మొత్తం 3847 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఈ ఉద్యోగ ఖాళీలు ఉంటాయి. మొత్తం ఉద్యోగ ఖాళీలలో అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ ఉద్యోగ ఖాళీలు 1726, స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగ ఖాళీలు 163, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగ ఖాళీలు 1931 ఉన్నాయి.

ఏపీలో అప్పర్ డివిజనల్ క్లర్క్ 7, స్టెనోగ్రాఫర్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 26 ఉన్నాయి. తెలంగాణలో అప్పర్ డివిజనల్ క్లర్క్ 25, స్టెనోగ్రాఫర్ 4, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 43 ఉన్నాయి. డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు యూడీసీ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. దీంతోపాటు ఇంటర్ పాసై నిమిషానికి 80 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు స్టెనోగ్రాఫర్ పోస్టులకు అర్హులు.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదో తరగతి పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

స్కిల్‌ టెస్ట్‌, ఎంటీఎస్‌ అభ్యర్థులకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ విధానంలో స్టెనో అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. జనవరి నెల 15వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా ఫిబ్రవరి నెల 15వ తేదీ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు.