ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ న్యూ ఇయర్ ఆఫర్ 2022ను లాంచ్ చేసింది. భారత్ ఫైబర్ (ఎఫ్టీటీహెచ్), ఎయిర్ ఫైబర్, డీఎస్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకు రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఫ్రీగా ఇవ్వను్నారు.

బీఎస్ఎన్ఎల్ బాస్ పోర్టల్ ద్వారా యాన్యువల్ అడ్వాన్స్ పేమెంట్ స్కీంకు అప్లై చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరింత సమాచారం కోసం బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్ లేదా బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ను సంప్రదించొచ్చు. యూజర్లు బీఎస్ఎన్ఎల్ బాస్ పోర్టల్ లోకి వెళ్లి డివైజ్ సెలక్ట్ చేసి సంవత్సరం పాటు యాన్యువల్ పేమెంట్ స్కీంలో జాయిన్ అవ్వాలి. అలా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత బీఎస్ఎన్ఎల్ బిల్లింగ్ అడ్రస్ కు డివైజ్ ను డిస్పాచ్ చేస్తుంది.