ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ సోమవారం క్యాట్ 2021 ఫలితాలు విడుదల చేసింది. ఈ పరీక్షలో మొత్తం తొమ్మిది మంది 100 శాతం మార్కులను సొంతం చేసుకున్నారు. మొతం క్యాట్ 2021 పరీక్షకు 156 పట్టణాల్లో మొత్తం 438 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా రెండు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు అయ్యారు. ఇక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.