తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటూ ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఈ నెల 16 తర్వాత ఒమిక్రాన్ పరిస్థితిపై సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుని అమలుచేయనున్నారు.