విజయనగరం జిల్లాలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లాలోని కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మందికి పరీక్షలు చేయగా.. ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో రెండ్రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు.