దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును తూప్రాన్ టోల్ గేట్ దగ్గర మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై ఎమ్మెల్యే రఘునందన్ తీవ్రంగా మండిపడ్డారు. తన నియోజకవర్గానికి తాను వెళుతుంటే అన్యాయంగా పోలీసులు అరెస్ట్‌ చేశారని రఘునందన్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా? అంటూ ప్రశ్నించారు.

ఇంకోవైపు తెలంగాణలో జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ చందనా దీప్తి హెచ్చరికలు జారీ చేసారు.