తెలంగాణ లో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన నుమాయిష్‌ ప్రవేశాన్ని జనవరి 10 వ తేదీ వరకు నిలిపివేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 1న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ కలిసి జ్యోతి వెలగించి ప్రారంభించారు కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ తెలిపింది.