దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా లాభాల బాట పట్టాయి. ఉదయం సెన్సెక్స్‌ 59,343.79 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమై కాసేపటికే 59,084.40 వద్ద స్వల్ప నష్టాల్లోకి జారుకుని, తిరిగి పుంజుకొని 59,937.33 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసి, చివరకు 672.71 పాయింట్ల లాభంతో 59,855.93 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,681.40 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,827.60 – 17,593.55 మధ్య కదలాడి చివరకు 179.55 పాయింట్లు లాభపడి 17,805.25 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ సూచీలో ఎస్ బి ఐ, పవర్ గ్రిడ్, రిలయన్స్, టైటాన్, ఎన్ టిపిసి షేర్లు లాభాలలో ముగిసాయి. డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు,సన్ ఫార్మా కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిసాయి.