ఈమధ్య కాలంలో అతి చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, రక్త హీనత,డయబెటిస్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వాటిని దూరం చేసుకోవడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దామా..

మిక్సీ జార్ లో ఒక కప్పు ఫూల్ మఖానా, 6 బాదం పప్పులు, ఒక స్పూన్ నువ్వులు, అరస్పూన్ సొంపు, 2 అంగుళాల దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి కలిపి ప్రతి రోజు తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు ఈ పాలను తాగితే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత సమస్య తగ్గుతాయి. ఇంకా డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఏదయినా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మందుల ద్వారా తగ్గించుకోవాలంటే అది కొన్నిసంవత్సరాల సమయం పడుతుంది. అలా కాకుండా మనం కాస్త శ్రద్ధ, సమయం వెచ్చించగలిగితే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.