తనకు టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం నుంచి హాని ఉందని, కాబట్టి కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. పార్లమెంటులో అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న అవినీతి, అక్రమాలను తాను వెలికితీస్తున్నానన…