కర్నూలులో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోను పెద్ద మార్కెట్ దగ్గర న్యాయవాదులు అడ్డుకున్నారు. హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టుకు మద్దతు తెలపాలని డిమాండ్‌ చేశారు. రోడ్ షోను అడ్డుకుంటున్న క్రమంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరగడంతో పెద్దమార్కెట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.