తాజ్‌మహల్‌లో బాంబ్ ఉందంటూ ఈ ఉదయం పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ వచ్చింది. దీంతో తాజ్‌మహల్ లో కోలాహలం మొదలైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. కానీ అది నకిలీ కాల్ అని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
తాజ్ మహల్ వద్ద బాంబు పెట్టినట్టు గురువారం ఉదయం పోలీసులకు ఫోన్‌కాల్ రావడంతో ‘‘సైనిక నియామకాల్లో అవతకవల కారణంగా నన్ను రిక్రూట్ చేసుకోలేదు. అందుకే తాజ్‌మహల్‌లో బాంబ్ పెట్టా. త్వరలోనే అది పేలుతుంది’’ అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పారని ఆగ్రా ఎస్పీ శివరామ్ యాదవ్ తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, తాత్కాలికంగా తాజ్ మహల్‌ను మూసివేశారు. పర్యాటకులను బయటకు పంపి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తోతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా, తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు అని పోలీసులు నిర్ధారించారు. ఫిరోజాబాద్‌కు చెందిన వ్యక్తి ఈ కాల్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.