హైదరాబాద్‌లో 56శాతం మహిళలు, 53శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని సీసీఎంబీ ప్రకటించింది. తెలిపింది. యాంటీబాడీలు ఉన్న 75శాతం మందికి కరోనా వచ్చినట్టు కూడా తెలియలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. నగరంలోని 30 వార్డుల్లో తొమ్మిదివేల మంది నమూనాలు పరిశీలించినట్టు చెప్పారు. భారత్‌ బయోటెక్‌ – ఎన్‌ఐఎన్‌తో కలిసి చేసిన సర్వే ప్రకారం 54శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయని చేసినట్టు సీసీఎంబీ తెలిపింది.

మరోవైపు, తెలంగాణలో కొత్తగా 152 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,99,406 మందికి వైరస్‌ సోకింది. వీరిలో 2,95,821 మంది కోలుకొని డిశ్చార్జి అవగా 1637 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1948 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.