గతనెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద వామన్రావు దంపతులను వేటకొడవళ్లతో నరికి చంపిన విషయం తెలిసిందే! ఈ కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు మంథని కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున మరో 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అంతకుముందు గోదావరిఖని ఆస్పత్రిలో నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరిచారు.
. ఈ కేసులో ముగ్గురు నిందితులు కుంట శ్రీను, కుమార్, చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన వేట కొడవళ్లను పార్వతి బ్యారేజ్ నుంచి వెలికి తీయించిన అధికారులు.. హత్యకు ముందు రెక్కీ నిర్వహించిన తీరుపై నిన్న సీన్రీకన్స్ట్రక్షన్ చేయించారు. నిందితుల వారం రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. మరో నిందితుడు బిట్టు శ్రీను పోలీసు కస్టడీ కొనసాగుతోంది.