శుక్రవారం తెల్లవారుజామున న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి తూర్పుగా భూకంపం సంభవించినట్లు పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం (పీటీడబ్ల్యూసీ) వెల్లడించింది.
రిక్టార్‌ స్కేల్‌ మీద దీని తీవ్రత 7.3గా నమోదయ్యింది. అమెరికన్‌ జియోలాజికల్ సర్వే ప్రారంభంలో ఈ భూకంపం తీవ్రతను 7.3 ఉండగా తరువాత దానిని 6.9కి సవరించింది.10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది. ఆ భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పీటీడబ్ల్యూసీ తెలిపింది. ప్రజల భద్రతా దృష్ట్యా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.