రిహాన్ అనే చిన్నారికి పోలీస్ కావాలనే కోరిక ఉండేది కానీ ఆ చిన్నారి కోరిక తీరే మార్గం లేదు.ఎందుకంటే ఆ చిన్నారి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దానితో అతని తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారు అంగీకరించడంతో గుంటూరు అర్బన్ ఎస్పీగా రిహాన్ బాధ్యతలు నిర్వర్తించాడు. అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి స్వయంగా ఆ బాలుడిని తన ఛాంబర్ లో కూర్చోపెట్టారు. బాలుడిని తో పాటు తలిదండ్రులు నోయెల్ చాంద్, బీబీ నూర్జహాన్ లు కూడా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గారి కి కృతజ్ఞతలు తెలియజేశారు. తన కోరిక నెరవేరినందుకు ఆ చిన్నారి చాలా సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. తమ చిన్నారి ముఖంలో నవ్వులు చూసి వారి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు.