ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఎక్స్ ప్లోరేషన్ సంస్థకు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ SN10 రాకెట్ ను ప్రయోగించిన కొద్ది నిముషాలకే పేలిపోయింది. SpaceX ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు,టెస్లా అధినేత టెక్సాస్ లోని బోకా చికా నుంచి బుధవరం సాయంత్రం ఈ రాకెట్ ని ప్రయోగించగా అది ప్రయోగించిన నిమిషాల్లోనే గాల్లో ఆరు మైళ్ళ ఎత్తున ఎగసిన ఈ టెస్ట్ రాకెట్ మంటలు మండిస్తు ఒక్కసారిగా లాంచ్ పాడ్ పై (భూమిపై) పడిపోయింది. కాగా ఈ బ్లాస్ట్ కి కారణం తెలియలేదు. స్పేస్ షిప్ ప్రొటోటైప్ 10 రకం రాకెట్ ను విజయవంతంగా ల్యాండింగ్ చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యం. బేస్ లో ఎటాచ్ అయిన లాండింగ్ లెడ్స్ తెరచుకోలేదని, దీంతో రాకెట్ మీథేన్ వాయువును తొక్కిపెట్టి పైప్స్ ని క్రష్ చేసిందని ఇదే ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని శాస్త్రవేత్తల అభిప్రాయం.

గతంలో SN 8, 9 ప్రొటోటైప్ రాకెట్లు కూడా ఇదే విధంగా పేలిపోయాయి. గతేడాది డిసెంబర్ లో SN8,ఈ ఏడాది ఫిబ్రవరిలో SN9రాకెట్లు ప్రయోగించిన కాసేపటికే పేలిపోయాయి. అయితే, స్సేస్ ఎక్స్ ఇప్పటికే ప్రొటోటైప్ 11 ను సిద్ధం చేసారని అనుకుంటున్నారు. అంగారకుడిపైకి మనుషులను పంపాలని లక్ష్యంగా పెట్టుకొని స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ప్రయోగాలు చేస్తున్నది. తన స్పేస్ ఎక్స్ రాకెట్ ని ఏదో ఒక రోజున వ్యోమగాములతో చంద్రునిపైకి, అంగారకునిపైకి పంపాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నారు. తాజా పరిణామంపై ఆయన స్పందిస్తూ తమ టీమ్ గ్రేట్ వర్క్ చేసిందని, ఏదో ఒకరోజున స్టార్ షిప్ ఫ్లైట్స్ సాధారణమైపోతాయని ఆయన అంటున్నారు. కాగా మళ్ళీ తన ప్రయోగాలను కొనసాగిస్తానని ఆయన పేర్కొంటున్నారు.