టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఆగస్టు 9 నుంచి నిట్ తరగతులు..??

ఏపిలో నిట్ తొలి ఏడాది విద్యార్థులకు జూలై 17న రెండో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తికావడంతో ఆగస్టు 1 వరకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యా శాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని సోమవారంనాడు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు ఈ తరగతులకు హాజరు కావాలి. జేఈఈ మెయిన్‌ పూర్తికాని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఫస్టియర్‌లో అడ్మిషన్ల ప్రక్రియకు ఇంకా సమయం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •