క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

తెలంగాణలో నకిలీ గోల్డ్ బిస్కెట్‌ల దందా..??

తెలంగాణ రాష్ట్రంలో నకిలీ గోల్డ్ బిస్కెట్‌ల దందా జోరుగా సాగుతోంది. రిస్క్ తక్కువగా ఉండడంతో ఎక్కువమంది బంగారు బిస్కెట్‌లను ఇన్వెస్ట్ మెంట్ రూపంలో దాచుకుంటారు. పైగా బంగారం ధర రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. అదే బంగారం ఓ రెండు వేల రూపాయలు తక్కువగా వస్తుంది అంటే అటు వైపే వెళ్తారు. అదే మోనోగ్రామ్ 99.99 గ్రాముల స్వచ్చమైన బంగారం అని స్టాంప్ ఉండడంతో నమ్మకంగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు.

ప్రస్తుతం తెలంగాణలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కసుమన్ ప్రాతినిద్యం వహిస్తున్న చెన్నూరు నియోజవర్గంలో నకిలీ బంగారు బిస్కెట్ల దందా కొనసాగుతోందని పోలీసులకు పలు ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ పోలీసులకు పై నుంచి ఈ విషయంలో కల్పించుకోకుండా రాజకీయ ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం! అసలు ఈ నకిలీ బంగారం ఎలా తయారు చేస్తారంటే.. బంగారాన్ని కరిగించే సమయంలోనే 99.990 బరువు ఉండే విధంగా అందులో వెండిని కలిపి తక్కువ ధరకే ఈ బిస్కెట్లు విక్రయిస్తారు.
గతంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఈ విషయంపై స్పందించని పోలీసులు ఇప్పుడు బాధితుల ఫిర్యాదుతో కదిలారని తెలుస్తోంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే బల్కసుమన్ ఎమ్మెల్యే గా ఉండడంతో ఈ వ్యవహారం అంతా అధికార పార్టీ కి చుట్టుకుంటుంది.

దీంతో ఈ నేపథ్యంలో ఒక రాజకయ నేత ఈ నకిలీ బంగారు బిస్కెట్ల దందా మీద పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు, పోలీసులు మాత్రం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తగ్గేది లేదంటున్నట్ట తెలుస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •