అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్‌లో సెమీస్‌ చేరిన దీపక్‌, రవి!!

భారత కుస్తీవీరులు రవికుమార్‌ దహియా (57 కిలోలు), దీపక్‌ పునియా (86 కిలోలు) తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బల్గేరియాకు చెందిన జార్జి వలెటినోవ్‌ను రవి 14-4 తేడాతో ఓడించగా, చైనాకు చెందిన లిన్‌ జుషెన్‌పై దీపక్‌ పునియా 6-3 తేడాతో విజయం సాధించాడు.

తొలి బౌట్లో దూకుడుగా ఆడిన దీపక్‌ పునియా క్వార్టర్స్‌లో అటు దూకుడు ఇటు రక్షణాత్మక విధానంలో విజయం సాధించి ప్రత్యర్థి అనుభవాన్ని గౌరవించాడు. లిన్‌ జుషెన్‌ను 6-3తో ఓడించాడు. తొలి పిరియడ్‌లో దీపక్‌ ఒక పాయింటు సాధించి 1-0తో ముందుకెళ్లి రెండో పిరియడ్‌లో వరుసగా 2, 2, 1 సాధించాడు. ప్రత్యర్థికి 1,2 పాయింట్లు మాత్రమే రావడంతో విజయం భారత కుస్తీవీరుడినే వరించింది.సెమీస్‌లో అతడు డేవిడ్‌ మోరిస్‌తో తలపడనున్నాడు.

ఇక రవికుమార్‌ అయితే గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. వరుసగా రెండో బౌట్లోనూ ప్రత్యర్థిని సాంకేతిక ఆధిపత్యంతోనే ఓడించాడు. అతడి పట్టుకు, టేక్‌డౌన్లకు జార్జి వలెటినోవ్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తొలి పిరియడ్‌లో వరుసగా 2, 2, 2 పాయింట్లు సాధించిన రవి 6-0తో ఆధిపత్యం సాధించాడు. ఇక రెండో పిరియడ్‌లో మరింత రెచ్చిపోయి వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థికి కేవలం 4 పాయింట్లే వచ్చాయి. మరో 16 సెకన్లు ఉండగానే బౌట్‌ ముగిసింది. సెమీస్‌లో కజక్‌స్థాన్‌ రెజ్లర్‌ సనయెన్‌ నురిస్లామ్‌తో తలపడనున్నాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •